మరోసారి ఏసీబీ పంజా.. శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీలు

by Kema Shiva Kumar |

శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు వరుసగా రెండోసారి తనిఖీలు చేపట్టారు.

మరోసారి ఏసీబీ పంజా.. శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయం మరోసారి ఏసీబీ అధికారుల తనిఖీలు చేపడుతున్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే అధికారులు రెండోసారి సోదాలు నిర్వహించడం స్థానికంగా పెను సంచలనం రేపుతుంది. అవినీతి ఆరోపణలు, పలువురు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో ఈ రెయిడ్స్ జరగుతున్నాయి. సోమవారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న అధికారులు, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా గేట్లు మూసివేసి గంటల తరబడి సోదాలు కొనసాగించారు.

ఫిర్యాదులే కారణం..

రెండు రోజుల క్రితం జరిగిన తనిఖీల్లో కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉండటం, అలాగే రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అవినీతిపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో మళ్లీ ఇవాళ తనిఖీలకు దిగారు. భూమి రికార్డుల మార్పిడి (Mutation), రిజిస్ట్రేషన్ అంశాల్లో కొందరు అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. కార్యాలయంలోని వివిధ విభాగాల ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వీఆర్వోలు, ఉన్నతాధికారుల వద్ద ఉన్న రికార్డులను సరిపోల్చారు. అవినీతికి పాల్పడే ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ తర్వాత నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు.

Next Story