- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ACB Notices: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula-E race case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula-E race case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. IAS అధికారి అరవింద్ కుమార్(IAS Arvind Kumar)కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు(ACB Notices) జారీ చేశారు. గురువారం ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్‌ను మూడుసార్లు విచారించగా, ఇది నాలుగోసారి కావడం విశేషం. కాగా, బీఆర్‌ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.






