కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చిన ACB.. ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-13 11:27:08  IST  )

మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు.

కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చిన ACB.. ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. రూ.75 వేల లంచం తీసుకుంటుండగా గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి ఆదిభట్లలో చోటుచేసుకుంది. ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్.. తనను లంచం అడుగుతున్నాడని ఓ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. అధికారి వరప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఎంట్రీ ఇచ్చారు. నోట్ల కట్టలు చేతిలో ఉన్న సమయంలో పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story