- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్ తెరవడానికి వెళ్లిన యువతి ఏమయిందో తెలుసా..
ఉదయం హోటల్ తెరవడానికి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, దోమ : ఉదయం హోటల్ తెరవడానికి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దోమ ఎస్సై విశ్వజన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఈడిగి అనసూయకు(48) ఐదుగురు కూతుర్లు ఉన్నారు. భర్త మరణించడంతో మండల కేంద్రంలో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగించేది. అనసూయ నాలుగో కూతురు ఈడిగి మహేశ్వరి(19) పరిగిలోని వెంకటేశ్వర కాలేజ్ లో చదువుతున్నది. దసరా సెలవులు ఉండడంతో హోటల్ లో తల్లికి సహాయం చేసేది.
అదే క్రమంలో ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం హోటల్ తెరవడానికి వెళ్లింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లి అనసూయ అనుమానంతో హోటల్ కి వెళ్లి చూసింది. మహేశ్వరి అక్కడ కనబడకపోవడంతో తను నెంబర్ కు ఫోన్ చేయగా రెండుసార్లు ఫోన్ లేపి తరువాత స్విచ్ ఆఫ్ చేసింది. దాంతో అనసూయ చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని తన కూతురి ఆచూకీ కోసం అడిగింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విశ్వజన్ తెలిపారు.






