- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లైన 6నెలలకే దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?
అదనపు కట్నం కోసం వేధించడంతో పెళ్లైన 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: అదనపు కట్నం కోసం వేధించడంతో పెళ్లైన 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉంటున్న సుష్మ 27 హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన సుష్మ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. యువతి తండ్రి ఆంజనేయులు మేనేజర్‌కు ఫోన్ చేయడంతో రాత్రి 10.30 గంటలకే ఆఫీసు నుండి వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన తండ్రి ఉదయం 4గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకోగా ఉదయం 7 గంటలకు దుర్గం చెరువులో మహిళ డెడ్ బాడీని గుర్తించారు. సుష్మ కుటుంబ సభ్యులను పిలిపించగా అది తమ కూతురిదే అని నిర్ధారించుకున్నారు. ఆరు నెలల క్రితమే సుష్మకు అమృత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌తో వివాహం జరిగిందని ఆంజనేయులు పోలీసులకు తెలిపారు. పెళ్లైన సమయంలో ఐదు తులాల బంగారం, ఆరు లక్షలు ఒక బైక్ కట్నంగా ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడం మొదలు పెట్టారని ఆ అవమానంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఘటనపై మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో అత్తింటి వేధింపుల వల్లనే సుష్మ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.






