బెంగుళూరులో పట్టపగలే యువతిపై దారుణం.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

బెంగుళూరులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. సరుకుల కోసం బయటకు వెళ్లిన యువతిపై కొంతమంది ఆకతాయిలు దాడి చేశారు.

బెంగుళూరులో పట్టపగలే యువతిపై దారుణం.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: బెంగుళూరులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. సరుకుల కోసం బయటకు వెళ్లిన యువతిపై కొంతమంది ఆకతాయిలు దాడి చేశారు. ఈ ఘటన బన్నెర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకులు గొడవపడుతూ ఉండగా యువతి వారిని దాటుకుని నడుచుకుంటూ వెళ్లింది. ఆమెను చూసిన ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె వారిని ఎదిరించడంతో ఏకంగా దాడికి పాల్పడ్డారు. యువతిని దారుణంగా కొట్టారు.

ఈ క్రమంలో అటువైపు వెళుతున్న ఓ వ్యక్తి యువతిని పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వెంటపడి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఘటనపై బాధిత యువతి స్పందించింది. సరుకుల కోసం తాను బయటకు వచ్చినట్టు చెప్పింది. ఆ సమయంలో నలుగురైదుగురు యువకులు మద్యం మత్తులో తిడుతూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను అసభ్యంగా తాకుతూ వేధించారని చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story