- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉస్మానియా యూనివర్సిటీలో ఊపిరి వదిలిన యువకుడు
దిశ, శంకరపట్నం : నవ మాసాలు మోసి కని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ కొడుకు తల్లికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, శంకరపట్నం : నవ మాసాలు మోసి కని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ కొడుకు తల్లికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన రెడ్డి కొమరయ్య, శోభ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. కుమారుడు రెడ్డి విజ్ఞాన్ తేజ హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆక్సిజన్ పార్కులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు యుక్త వయసులో బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలో స్వగ్రామానికి తీసుకువచ్చిన కుమారుని మృత దేహాన్ని చూసిన కన్నతల్లి గుండెల విసేలా రోదించింది. ఆ తల్లి పాడే మోయడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. యువతరం క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో తల్లిదండ్రులను దుఃఖ సాగరంలో ముంచుతున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.






