రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

by Ratna Kumari |

దిశ, కొండపాక: నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం వెళ్తుండ‌గా.. అక‌స్మాత్తుగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
X

దిశ, కొండపాక: నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం వెళ్తుండ‌గా.. అక‌స్మాత్తుగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. కుకునూర్ ఎస్ఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన కాసర్ల వంశీకృష్ణ బుధవారం రాత్రి (డిసెంబర్ 31) తన స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకోవడానికి సిద్దిపేట నుండి కుకునూర్ పల్లికి వస్తుండగా.. మార్గమధ్యలో, కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామ శివారు లో మూల మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంశీకృష్ణ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Next Story