రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..ఆదిలాబాద్ రూరల్ మండలం దార్లోద్ది గ్రామానికి చెందిన తుమ్రం వంశీ(20) అనే యు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
X

దిశ, ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..ఆదిలాబాద్ రూరల్ మండలం దార్లోద్ది గ్రామానికి చెందిన తుమ్రం వంశీ(20) అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి బైక్ పై తన గ్రామానికి వెళ్తుండగా..అంకోలి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొన్నారు.ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వంశీ అనే యువకుడిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.దీంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది.

Next Story