- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుపాటుకు యువకుడు మృతి
by Batti.Sumithra |
మండలంలోని నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బెజ్జాల గ్రామానికి చెందిన మడవి సాయికుమార్ (22) అనే యువకుడు శనివారం రాత్రి పిడుగు పడి మృతి చెందాడు.

X
దిశ, తాండూర్ : మండలంలోని నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బెజ్జాల గ్రామానికి చెందిన మడవి సాయికుమార్ (22) అనే యువకుడు శనివారం రాత్రి పిడుగు పడి మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సాయికుమార్ బెజ్జాల గ్రామ శివారులో పశువులను మేపెందుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వస్తుండగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురియడంతో చెట్టు కింద వెళ్ళాడు.
అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో సాయికుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు యువకుడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు మాదారం పోలీసు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






