- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల వేటకు వెళ్లి ఒక యువకుడి మృతి
by Kema Shiva Kumar |
చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండల పరిధిలోని కందిపల్లిలో గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, పాపన్నపేట : చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండల పరిధిలోని కందిపల్లిలో గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్టి ఎల్లయ్య (25) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, మంగళవారం ఉదయం మిత్రులతో కలిసి కందిపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి.. చేపలు పట్టి అటువైపు నుంచి ఈవోలు ఒడ్డుకు ఊదుతూ వస్తున్న క్రమంలో చెరువు మధ్యలోకి రాగానే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. గమనించిన తోటి మిత్రులు ఎల్లయ్యను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పాపన్నపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






