ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి

by Disha Web Desk 1 |
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
X

దిశ, చిన్నశంకరంపేట : ప్రమాదవశాత్తు ఓ యువకుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు పాడుబడిన బావి వద్దకు వెళ్లి అందులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని అంబాజీపేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్ గౌడ్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మండల కేంద్రానికి చెందిన డబ్బు చిన్న నరసింహులు (35) అన్నయ్య బండారి వెంకటి ఇంట్లో ఫంక్షన్ ఉన్నందున అంబాజీపేటకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు.

దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా రోడ్డుపై బైక్ పార్క్ చేసి ఉంది. అదే ప్రాంతంలో ఓ పాడుబడిన బావిలో నరసింహులు మృతదేహం శవమై తేలినట్లు వారు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు కిట్టు (5) కుమార్తె లాస్య (3) ఉన్నారు.



Next Story

Most Viewed