- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య
కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, హన్వాడ : కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామానికి చెందిన బోయిని శివరాజు ( 30 ) గత సంవత్సర కాలంగా కడుపునొప్పితో బాధపడుతూన్నాడు. ఈ నెల 12న తెల్లవారు జామున కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఆ నొప్పిని భరించలేక ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు బోయిని కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
Next Story






