పెళ్లి కాలేదని మనస్తాపం చెంది యువకుడి ఆత్మహత్య..

by Taduka Kalyani |   (  Updated:2023-05-20 14:17:02  IST  )

పెళ్లి కాలేదని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పెళ్లి కాలేదని మనస్తాపం చెంది యువకుడి ఆత్మహత్య..
X

దిశ, దౌల్తాబాద్: పెళ్లి కాలేదని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ కుమార్ కథనం ప్రకారం.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మాలకాడి విజయ్ కుమార్ (26) కొన్ని రోజుల నుంచి పెళ్లి కాలేదనే బెంగతో మద్యం తాగుతూ తిరిగేవాడు.

పెళ్లి విషయంలోనే ఇంట్లో కుటుంబసభ్యులతో అప్పుడప్పుడు గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే తనకు ఎందుకు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెంది విజయ్ కుమార్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story