- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్‌డెస్క్: తీన్మార్ మల్లన్న ఆఫీస్(క్యూ న్యూస్) ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. సాయి అనే యువకుడు గురువారం మధ్యాహ్నం బోడుప్పల్‌లోని క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చాడు. క్యూ న్యూస్ సిబ్బందిని కలిసి తీన్మాన్ మల్లన్నలో మాట్లాడాలని చెప్పాడు. బీసీ రిజర్వేష అంశంలో ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని.. దీనిపై మల్లన్నతో మాట్లాడటానికి వచ్చానని చెప్పారు. అయితే.. మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని అక్కడున్న సిబ్బంది చెప్పి పంపించారు.. అక్కడి నుండి కిందకి వచ్చిన యువకుడు.. కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువకున్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే గాంధీ ఆస్పత్రికి బయలుదేరినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






