ఆర్థిక ఇబ్బందులతో యువ రైతు ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, తూప్రాన్ : ఆర్థిక ఇబ్బందుల‌తో యువ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న తూప్రాన్ మండ‌ల ప‌రిధిలోని వెంక‌టాయ‌ప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

ఆర్థిక ఇబ్బందులతో యువ రైతు ఆత్మహత్య
X

దిశ, తూప్రాన్ : ఆర్థిక ఇబ్బందుల‌తో యువ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న తూప్రాన్ మండ‌ల ప‌రిధిలోని వెంక‌టాయ‌ప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వెంక‌టాయ‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఉప్పల తిరుపతి (31) అనే యువ రైతు అప్పుల బెడ‌ద ఎక్కువ కావ‌డం.. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు.

Next Story