- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువరైతు ఆత్మహత్యకు కారణాలు అవేనా..
by Batti.Sumithra |
ఓవైపు మానసిక ఇబ్బందులు, మరోవైపు ఆర్థికపరమైన ఇబ్బందులను తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

X
దిశ, మిరుదొడ్డి : ఓవైపు మానసిక ఇబ్బందులు, మరోవైపు ఆర్థికపరమైన ఇబ్బందులను తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బుధవారం అర్థరాత్రి జరగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మిరుదొడ్డి మండల మొగుళ్ళ కేసుల కుమార్ (34) అనే యువరైతు బుధవారం అర్ధరాత్రి సమయంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునికి పెళ్ళై సుమారు ఏడు సంవత్సరాలు గడిచిన పిల్లలు కాకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేశాడని తెలిపారు. మరో వైపు అకావ వర్షాలు, వడగళ్ల వానతో వరి పంట నష్టపోయి పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో యువరైతు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






