- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహితను మర్డర్ చేసిన మాంత్రికుడు.. సంతానం కోసం వెళ్తే..
డిజిటల్ యుగంలో ఉన్న మనం ఒక్కోసారి మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటాం. కారణం మనలో ఉండే వీక్‌నెస్. ఏదో ఒక బలహీనత మనం తప్పటడుగు వేసేలా చేస్తుంది. అదే ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఓ మహిళ వివాహమై

దిశ, వెబ్ డెస్క్ : డిజిటల్ యుగంలో ఉన్న మనం ఒక్కోసారి మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటాం. కారణం మనలో ఉండే వీక్‌నెస్. ఏదో ఒక బలహీనత మనం తప్పటడుగు వేసేలా చేస్తుంది. అదే ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఓ మహిళ వివాహమై పదేళ్లు కావస్తున్నా పిల్లలు కలగడం లేదని.. ఓ మాంత్రికుడిని ఆశ్రయించగా.. పిల్లల మాట అటుంచితే.. ప్రాణాలే తీశాడు ఆ మాంత్రికుడు. ఇందుకు సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అజంఘర్‌లోని పహల్వానాపూర్‌కు చెందిన అనురాధా యాదవ్‌కు 2014లో పెళ్లి జరిగింది. కానీ సంతానప్రాప్తి లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఫలితం లేదని.. ఓ పాపులర్ మాంత్రికుడున్నాడని ఇరుగు పొరుగు చెప్పడంతో అతన్ని సంప్రదించాలని నిర్ణయించుకుంది. తల్లితో కలిసి అక్కడకు వెళ్లింది. అయితే అక్కడ మాంత్రికుడు తన సహచరులతో కలిసి అనురాధ జుట్టు పట్టి కొట్టడం, కింద పడేసి తన్నడం ప్రారంభించాడు. ఏం చేస్తున్నారని తల్లి ఆపితే.. ఆమె మీద దెయ్యం ఉందని చెప్పి.. దారుణంగా కొట్టడంతో పడిపోయింది అనురాధ. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించింది.






