లారీ ఢీకొని మహిళ మృతి

by Nallavelli.Anjaneyulu |

లారీ ఢీ కొని మ‌హిళా ఋతి చెందిన సంఘ‌ట‌న మండ‌లంలోని గోల్నెప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 1

లారీ ఢీకొని మహిళ మృతి
X

దిశ, వలిగొండ : లారీ ఢీ కొని మ‌హిళా ఋతి చెందిన సంఘ‌ట‌న మండ‌లంలోని గోల్నెప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర చంద్రమ్మ (70) ఇంటి ముందు కూర్చుని ఉండగా మద్యం మత్తులో డ్రైవర్ లారీ ని అతి వేగంగా నడుపుతూ చంద్రమ్మ మీదికి వెళ్లడంతో కాళ్లు నుజ్జు నుజ్జు అయి తీవ్ర గాయాలు కావడంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రమ్మ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.

Next Story