- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూట్యూబ్‌లో చూసి భర్త మర్డర్‌కు ప్లాన్.. అద్దెకున్న వ్యక్తితో రాసలీలలకు అడ్డు అనే..
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. తనకు అడ్డొస్తున్నాడని భార్య.. భర్తను ఫ్రై చేసింది. ఈ లోకం నుంచి ఎలిమినేట్ చేయాలనుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే..

రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. తనకు అడ్డొస్తున్నాడని భార్య.. భర్తను ఫ్రై చేసింది. ఈ లోకం నుంచి ఎలిమినేట్ చేయాలనుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. కొంత కాలంగా ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంది భార్య. అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన భర్త.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, వెంటనే ఇల్లు ఖాళీ చేసి పంపించేశాడు. అయితే అతన్ని కలిసేందుకు భార్య వెళ్లగా.. అక్కడ లేకపోవడంతో.. కాల్ చేస్తే తనను వెళ్లాగొట్టాడని కన్ఫర్మ్ చేశాడు ప్రియుడు. దీంతో కోపంతో ఊగిపోయిన సతి.. భర్తను చంపేయాలని ప్లాన్ చేసింది. ఐడియా కోసం యూట్యూబ్ చూసింది. నిద్రలోకి జారుకున్న వ్యక్తిపై సలసల కాగిన నూనె పోసి.. తన ప్లాన్‌ను అమలు చేసింది.
కాగా భారీగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా రాజస్థాన్ అమ్మాయిల తీరే వేరయ్యా.. చంపేందుకైనా ఈజీ మెథడ్ చూజ్ చేసుకోలేదు చూశారా అని కామెంట్స్ చేస్తున్నారు. కొవిడ్ కంటే ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయింది భర్తలను చంపడమనే కాన్సెప్ట్ అని ఇంకొందరు అంటున్నారు.






