- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. చైనా మాంజా తగిలి కోసుకుపోయిన గొంతు
చైనా మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయి. చైనా మాంజాపై నిషేదం విధించినా అధికారుల నిర్లక్ష్యం, నిఘా లేకపోవడం వల్ల మార్కెట్ లో కావాల్సినంత దొరుకుతుంది.

దిశ, వెబ్ డెస్క్: చైనా మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయి. చైనా మాంజాపై నిషేదం విధించినా అధికారుల నిర్లక్ష్యం, నిఘా లేకపోవడం వల్ల మార్కెట్ లో కావాల్సినంత దొరుకుతుంది. తక్కువ ధరకే ఇది దొరకడంతో చాలా మంది పతంగ్ లు ఎగరేస్తున్నారు. ఇక సంక్రాంతి దగ్గరపడటంతో ఎక్కడ చూసినా ఈ మాంజానే కనిపిస్తోంది. మాంజావల్ల ప్రమాదాలు కూడా మొదలయ్యాయి.
ఇప్పటికే హైదరాబాద్ లో ఓ వ్యక్తి చైనా మాంజా గొంతుకు కోసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కాగా తాజాగా మరో వ్యక్తి సైతం చైనా మాంజా తగిలి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన శంషీర్‌గంజ్ ప్రాంతంలో జరిగింది, నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్ అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా మెడకు చైనా మాంజా తగిలింది. అది గొంతును కోయడంతో తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.






