- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో ఐదుగురు దుర్మరణం
కరెంట్ షాక్‌తో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రామాంతపూర్ పరిధిలోని గోకులే నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/ఉప్పల్: కరెంట్ షాక్‌తో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రామాంతపూర్ పరిధిలోని గోకులే నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. అయితే, రథాన్ని లాగేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం చెడిపోవడంతో యువకులు అంతా కలిసి రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పైనే ఉన్న హై టెన్షన్ వైర్లు రథానికి తగిలి తొమ్మిది మంది యువకులు చెల్లాచెదురుగా పడిపోయారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు, కాలనీవాసులు వారిని ప్రథమ చికిత్ సకోసం ఆసుపత్రికి తరలించగా.. అందులో ఐదుగురు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారిలో కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్ (34), శ్రీకాంత్ రెడ్డి (35), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) ఉన్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.






