- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదేళ్ల బాలుడి పై వీధి కుక్కల దాడి..
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పదేళ్ల బాలుడిపై నాలుగు వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటనలో బాలుడు గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పదేళ్ల బాలుడిపై నాలుగు వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటనలో బాలుడు గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించడంతో వీధికుక్కలు పరారయ్యాయి. ఎర్రగడ్డ కాలనీకి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు సిద్దు తమస్వంత మిల్క్ సెంటర్ నుండి ఇంటికి వెళుతుండగా నాలుగు కుక్కలు బాలుడి పై ఒక్కసారిగా దాడికి దిగాయి.
వెంటనే స్థానికులు రావడంతో కుక్కలు పరారయ్యాయి. ఈ ఘటనలో బాలుడి కాళ్లు, పిక్కలకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కుక్కలు, పందుల బెడద రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.
Also Read.
Next Story






