ఉపాధ్యాయుడి నిర్వాకం.. విద్యార్థులకు బూతు సినిమాలు చూపిస్తూ ఆపై అసభ్యకరంగా

by Disha Web Desk 7 |
ఉపాధ్యాయుడి నిర్వాకం.. విద్యార్థులకు బూతు సినిమాలు చూపిస్తూ ఆపై అసభ్యకరంగా
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులు తప్పులు చేస్తే వాటిని సరిచేసి వారిని మంచి మార్గంలో పెట్టేవాడు. కానీ ఓ నీచపు ఉపాధ్యాయుడు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకున్నాడు. తన వద్ద పాఠాలు చేర్చుకునే విద్యార్థినిలకు బూతు వీడియోలు చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

గోండియా జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే 5వ తరగతి చదువుతున్న ఎనిమిది మంది పిల్లలకు బూతు వీడియోలు చూపించాడు. అంతే కాకుండా ఆ విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వారి ప్రైవేట్ పార్ట్స్‌పై టచ్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో విద్యార్థినిలు వారి తల్లిదండ్రులకు చెప్పారు. కోపాద్రిక్తులైన పేరేంట్స్ ఆ నిచపు ఉపాధ్యాయుడు గురించి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అంతర్గత విచారణ జరిపించి ఉపాధ్యాడుది తప్పు ఉందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆ కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed