- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కత్తిపోట్ల కలకలం
ఏపీలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కత్తిపోట్ల కలకలం రేగింది. కొందరు యువకులు ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కత్తిపోట్ల కలకలం రేగింది. కొందరు యువకులు ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఎంతో భక్తితో జరుపుకోవాల్సిన శోభాయాత్రలో కొందరు యువకులు కత్తుళ్లు, గొడ్డళ్లతో డ్యాన్సులు చేస్తూ వీరంగం సృష్టించారు.
ఈ క్రమంలోనే శోభాయాత్ర జరుగుతుండగా సుంకర సురేశ్, కొమ్మూరి శంకర్ లపై కటికిరెడ్డి బన్ను అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. పాతకక్షల వల్లనే దాడి చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక గ్రామంలో యువకులు వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు బయపడిపోతున్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా చూడాలని కోరుతున్నారు.






