- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: మాదాపూర్‌లో తీవ్ర విషాదం.. మైండ్ స్పేస్ భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad)లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్(Madapur Police Station) పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైండ్ స్పేస్ భవనం(Mind Space Building) పైనుంచి దూకి నవీన్ రెడ్డి(Naveen Reddy) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software Employee) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుకుసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నవీన్ రెడ్డి ఎన్‌సీఆర్ ఓఎక్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు గుర్తించారు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని అమరావతిగా నిర్ధారించారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






