- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక (Karnataka) రాష్ట్రం బాగేపల్లి (Bagepally)కి చెందిన ఓ బృందం టెంపో ట్రావెలర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో వారి టెంపోను అన్నమయ్య జిల్లా కురబలకోట మండల పరిధిలోని చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో టెంపో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. ముగ్గురు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్సుల ద్వారా మదనపల్లె (Madanapalle) ప్రభుత్వాసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందజేస్తున్నారు.






