రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-05 03:54:17  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన యద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన యదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే చౌటుప్పల్ మండలం ఖైతాపురం దాటి బొర్రలగూడెం (Borralagudem) వద్దకు రాగానే వారి కారును ఓ లారీ బలంగా ఢికొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన మద్దెల సావిత్రమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హైవే పాట్రోల్ సమాచారం మేరకు స్పాట్ చేరుకున్న చౌటుప్పల్ పోలీసు (Choutuppal Police)లు నడిరోడ్డుపై పడి ఉన్న కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అదేవిధంగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా చౌటుప్పల్ పోలీసులు తెలిపారు.

Next Story