- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏకంగా 8 మంది దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu)లోని కడలూర్ (Kadalur) జిల్లాలో ఈ రాత్రి చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu)లోని కడలూర్ (Kadalur) జిల్లాలో ఈ రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి (Trichy) నుంచి చెన్నై (Chennai)కి వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు టైరు పగిలిన కారణంగా నియంత్రణ తప్పింది. దీంతో అతివేగంతో ఉన్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






