- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస దొంగతనాల కలకలం.. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ
by Chintha Aamani |
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

X
దిశ, గుమ్మడిదల : గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో వరుస దొంగతనాలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అన్నారం వార్డు ప్రకృతి నివాస్ కాలనీలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లలో దుండగులు ఒకేసారి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనతో మున్సిపాలిటీ వ్యాప్తంగా కలకలం రేగింది. విలువైన బంగారం, నగదు పోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వారం క్రితం ఇదే కాలనీలో మరో రెండు ఇళ్లలో కూడా ఇలాంటి చోరీలు జరిగినట్లు కాలనీవాసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోయిన వస్తువులు, నగదు విలువ తెలియాల్సింది.
Next Story






