బైకు ను ఢీ కొట్టిన స్కూల్ బ‌స్సు.. వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

బైకు ను స్కూల్ బ‌స్సు ఢీ కొట్టిన ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా రాయిక‌ల్ మండ‌లం రామాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది.

బైకు ను ఢీ కొట్టిన స్కూల్ బ‌స్సు.. వ్య‌క్తి మృతి
X

దిశ‌, మల్లాపూర్/రాయికల్ : బైకు ను స్కూల్ బ‌స్సు ఢీ కొట్టిన ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా రాయిక‌ల్ మండ‌లం రామాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ల్లాపూర్ మండ‌లం గుండంప‌ల్లి గ్రామానికి చెందిన పుల్లూరి మ‌ధు(35) రాయిక‌ల్ మండ‌లం భూప‌తిపూర్ గ్రామానికి ఫంక్ష‌న్ కి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా.. రాయిక‌ల్ మండ‌ల కేంద్రానికి చెందిన కృష్ణ‌వేణి టాలెంట్ స్కూల్ బ‌స్సు బైకు ను రామాజీపేట గ్రామ శివారులో ఢీ కొట్టింది. దీంతో మ‌ధు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మృతునికి భార్య ల‌త‌, కూతురు రీత‌న్య ఉన్నారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story