యువతి పై అత్యాచారం చేసిన ప్రజాప్రతినిధి..

by Disha Web Desk 20 |
యువతి పై అత్యాచారం చేసిన ప్రజాప్రతినిధి..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణంలో గల నిరుపేద కుటుంబానికి చెందిన యువతిపై ఒక ప్రజాప్రతినిధి అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బయటకు రాకుండా ఉండడానికి సదరు ప్రజాప్రతినిధి కులపెద్దల సమక్షంలో జరిమానా సైతం చెల్లించినట్లు సమాచారం. ఈ అత్యాచార ఘటన, కుల సంఘానికి జరిమానా ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఆర్మూర్‌లో ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అదే వార్డులో నివసించే యువతిపై కన్నేశాడు.

ఈ క్రమంలోనే యువతిపై అత్యాచారం చేశాడు. అత్యాచార విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కుటుంబసభ్యులు, కొందరు పెద్దలు కలిసి ప్రజాప్రతినిధిని నిలదీశారు. అత్యాచార విషయం ప్రచారం జరిగితే ప్రమాదమని భావించిన ప్రజాప్రతినిధి.. కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో అత్యాచారానికి గురైన యువతికి సుమారు రూ.8 లక్షలు చెల్లించినట్లు ఆర్మూర్‌లో ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. అత్యాచారం చేసిన ఆ ప్రజాప్రతినిధిపై ప్రజలు మండిపడుతున్నారు. ఇదేం రాజకీయం అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed