- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చావుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా వ్యక్తి మృతి
దిశ, నాగర్ కర్నూల్ : చావుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా .. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

దిశ, నాగర్ కర్నూల్ : చావుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా .. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మాజిపేట మండలానికి చెందిన మీసాల రాములు (46) వంగూర్ మండలం జజాల గ్రామం లో చావుకి వెళ్లి తిరిగి తిమ్మాజిపేట వెళ్తుండగా గుంతకోడూరు శివారులో రహదారిపై పోసిన మొక్కజొన్నల్లో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108 సహాయంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. రోడ్డు ప్రమాదానికి తాడూరు నుంచి కల్వకుర్తి వెళ్లే రోడ్డుపై ఆరబోసిన మొక్క జొన్నలే కారణమని స్థానికులు తెలిపారు. రహదారిపై మొక్కజొన్నలు, వరి, వంటి పంటలు పోయడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మొక్కజొన్న, వరి ధాన్యాలు పోయకుండా చూడాలని కోరుతున్నారు. భర్త మృతి విషయం తెలుసుకున్న భార్య జిల్లా ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నేరుగా విలపించారు.






