రోడ్డు ప్రమాదంలో వ్య‌క్తి దుర్మ‌ర‌ణం.. ఇద్ద‌రికీ తీవ్ర గాయాలు

by Ratna Kumari |

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శివారులోని రాజీవ్ రహదారి పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయి.

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శివారులోని రాజీవ్ రహదారి పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయి. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న కోటిరెడ్డి(50) కరీంనగర్ నుంచి వస్తూ చైతన్య కాలేజ్ దగ్గర బస్సు దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బైక్ ఢీ కొంది. ఈ ప్రమాదం లో బైక్ నడుపుతున్న రానా ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందగా.. కోటిరెడ్డి కి కాలుకి తీవ్ర గాయాల‌య్యాయి. అర్జున్ తలపై బలమైన గాయం అవగా సమాచారం అందుకున్న 108 తిమ్మాపూర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story