- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మండలంలోని ఆరెగూడెం గ్రామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి.

దిశ, వెల్దుర్తి : మండలంలోని ఆరెగూడెం గ్రామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన మరికంటి శంకర్(36) వెల్దుర్తికి వచ్చి ద్విచక్ర వాహనం పై వెళ్తున్నాడు. అందుగులపల్లి గ్రామానికి చెందిన అక్కముల వినేష్ గ్రామానికి చెందిన చింతల రాజమణి పద్మను తన ద్విచక్ర వాహనం పై తీసుకొస్తుండగా.. ఇండియన్ గ్యాస్ గోదాం వద్ద ఎదురెదురుగా వస్తున్నన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో శంకర్ వాహనం అదుపు తప్పి పడిపోయింది. దీంతో శంకర్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు అందుగులపల్లి గ్రామానికి చెందిన వినేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఇద్దరు మహిళలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు శంకర్ కి తల్లిదండ్రులు విజయ, ఆనంద్, భార్య స్వప్న, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. చేతికి వచ్చిన కొడుకు పని నిమిత్తం వెల్దుర్తికి వచ్చి అంతలోనే రోడ్డు ప్రమాదంలో విగత జీవి కావడంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు పై ధాన్యం ఆరపోయడం వల్ల తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ధాన్యం ఆరబోసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించారు. గతంలో కూడా ఈ దారిపై రైతులు విచ్ఛలవిడిగా ధాన్యం ఆరబోయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయని.. కొన్ని కుటుంబాలు వీధిన పడ్డాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పైనే ఆందోళన చేశారు. ఈ ఘటన పై స్పందించిన పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాల ప్రజలు ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి ఎస్సై రాజు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూఫ్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






