- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Ratna Kumari |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, ఎర్రవల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని పుల్లారెడ్డి పెట్రోల్ బంకు సమీపంలోని జాతీయ రహదారి పై ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మన్న రోడ్డు దాటుతున్న క్రమంలో కర్నూల్ నుండి గద్వాలకి వెళుతున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఉప్పరి లక్ష్మన్న (75) సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందినాడు.కొడుకు ఉప్పరి మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణమని ఇటిక్యాల ఎస్ఐ రవి తెలిపారు.
Next Story






