- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండరాయిని ఢీ కొట్టిన బైకు.. పొలంలో పడి వ్యక్తి మృతి
నియంత్రణ కోల్పోయిన ఓ ద్విచక్ర వాహనం బండరాయిని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కపల్లి-సజ్జనపల్లి రహదారిపై బుధవారం చోటుచేసుకుంది.

దిశ, తాడ్వాయి(లింగంపేట): నియంత్రణ కోల్పోయిన ఓ ద్విచక్ర వాహనం బండరాయిని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కపల్లి-సజ్జనపల్లి రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...ఎక్కపల్లి గ్రామానికి చెందిన దకన్నా మల్లేష్ (38)తన ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బైక్ పక్కనే ఉన్న బండరాయిని బలంగా ఢీకొనడంతో మల్లేష్ గాలిలో ఎగిరి పక్కనే ఉన్న వరి పొలంలో పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషయం తెలుసుకున్న లింగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుని భార్య స్వప్నను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టకూడదని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిటిజెన్ సెంట్రిక్ అప్రోచ్ ను అమలు చేస్తూ, ఆసుపత్రి వద్దే మృతుడి భార్య నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కేవలం కొద్ది గంటల్లోనే కేసు నమోదు ప్రక్రియ పూర్తి చేసి, ఎఫ్.ఐ.ఆర్ కాపీని నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లి అందజేశారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించిన లింగంపేట పోలీసుల తీరును పలువురు అభినందిస్తున్నారు.






