గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

by Ratna Kumari |

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని నాగారం గ్రామంలో చోటు చేసుకుంది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, హుస్నాబాద్ : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన ఇజ్జిగిరి రాజు (48) ఆదివారం కోహెడ మండలంలో జరిగిన సింగరాయ జాతరకు వెళ్లి కాలినడకన రాత్రి హుస్నాబాద్ తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన‌ట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు రాజగోపాల్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

Next Story