- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారం తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మండలంలోని చెట్ల తిమ్మాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, చేగుంట : ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారం తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మండలంలోని చెట్ల తిమ్మాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎరుకల రవి కి ఏడాది క్రితం భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్పించడంతో సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో రవి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ వచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 23న మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని గడ్డి మందు తాగిన రవిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుదవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఎరుకల యాదమ్మ చేసిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






