అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

by Ratna Kumari |

అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లింగంపేట మండల కేంద్రంలో శుక్ర వారం చోటు చేసుకుంది.

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, లింగంపేట : అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లింగంపేట మండల కేంద్రంలో శుక్ర వారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ దీపక్‌ కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కోమాట్పల్లి పోచయ్య (48) కొంతకాలంగా అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, తన ఇంటి ముందున్న వేప చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేలోపే పోచయ్య మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శవాన్ని పంచనామా నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story