నీటి బ‌కెట్ లో ప‌డి ఏడాదిన్న‌ర చిన్నారి మృతి

by Ratna Kumari |

నీటి బకెట్ లో ప‌డి ఏడాదిన్న‌ర చిన్నారి మృతి చెందిన సంఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ మున్సిప‌ల్ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.

నీటి బ‌కెట్ లో ప‌డి ఏడాదిన్న‌ర చిన్నారి మృతి
X

దిశ‌, భూత్పూర్ : నీటి బకెట్ లో ప‌డి ఏడాదిన్న‌ర చిన్నారి మృతి చెందిన సంఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ మున్సిప‌ల్ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కటిక మహమూద్ దంపతుల కుమార్తె జుబేరియా ఏడాదిన్న‌ర పాప‌. ఆమె తల్లి ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా మెల్లగా నడుచుకుంటూ వెళ్లి నీళ్లు ఉన్న బకెట్ లోకి వంగి చూసింది. తలక్రిందులుగా పడి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. కొంతసేపటి తర్వాత తల్లి చూసి బయటకు తీయగా.. అపస్మారక స్థితికి చేరింది. 108 లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జుబేరియా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Next Story