వ్యక్తి దారుణ హత్య..తమ్ముని కొడుకు చేతిలోనే

by velandi.Saikiran |   (  Updated:2026-06-22 15:59:08  IST  )

మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి అంబాదాస్ (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

వ్యక్తి దారుణ హత్య..తమ్ముని కొడుకు చేతిలోనే
X

దిశ, కోస్గి : మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి అంబాదాస్ (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ, భూ తగదాల నేపథ్యంలో మృతుని తమ్ముని కొడుకు శివకుమార్ కత్తితో నరికి హతమార్చాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Next Story