- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోరు బండి ఢీ కొని మోటార్ సైక్లిస్ట్ మృతి
దిశ, నవాబుపేట : బోరు బండి ఢీకొని మోటార్ సైక్లిస్ట్ మృతి చెందిన సంఘటన శనివారం నవాబుపేట- మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై పెట్రోల్ పంపు దగ్గర చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్

దిశ, నవాబుపేట : బోరు బండి ఢీకొని మోటార్ సైక్లిస్ట్ మృతి చెందిన సంఘటన శనివారం నవాబుపేట- మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై పెట్రోల్ పంపు దగ్గర చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన బ్యాగరి చంద్రయ్య (59) నవాబుపేట మండల కేంద్రంలో పెయింటర్ గా పని చేస్తుంటాడు. శనివారం తన పనులు ముగించుకొని తన మోటార్ సైకిల్ పై ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అదే సమయంలో మహబూబ్ నగర్ వైపు నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా తన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి బోరు బండి డ్రైవర్ చౌడాపూర్ గ్రామానికి చెందిన బొర్ర శ్రీకాంత్ తన వాహనంతో చంద్రయ్య వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో చంద్రయ్య తలకు బలమైన గాయమైంది. చంద్రయ్యకు అయిన గాయాల నుంచి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.






