- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురికి తండ్రి పోలికలు వచ్చాయని 3 నెలల పసికందును చంపిన తల్లి
ఇటీవల చాలా మంది ఆలోచన శక్తి కోల్పోయి క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది ఆలోచన శక్తి కోల్పోయి క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. అలాగే కన్న బిడ్డలను కూడా అతి కిరాతకంగా తల్లిదండ్రులే ప్రాణాలు తీస్తున్న ఘటనలు అందరి మనసును కలిచివేస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్రలో కూతురికి తన పోలికలు రాలేదని తల్లి 3 నెలల శిశువు గొంతుకోసి చంపేసింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ మహిళ ఇటీవల కూతురికి జన్మనిచ్చింది. అయితే కూతురి పోలీకలు తన తండ్రిలా ఉన్నాయని అత్తమామలు, బంధువులు, చుట్టుపక్కల వారు చర్చించుకునేవారు. దీంతో అది భరించలేని మహిళ మనస్తాపానికి గురైంది. తన 3 నెలల పసికందు గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే కూతురు ఎలా మృతి చెందిందని తల్లిని విచారణ చేశారు. దీంతో ఆ మహిళ తడబడుతూ సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం తెలిపింది. కూతురిని తానే చంపినట్లు నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు






