ఉరేసుకొని వివాహిత బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

by Ratna Kumari |

ఉరేసుకొని వివాహిత బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని జూలూరు గ్రామంలో చోటు చేసుకుంది.

ఉరేసుకొని వివాహిత బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
X

దిశ‌, భూదాన్ పోచంప‌ల్లి : ఉరేసుకొని వివాహిత బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని జూలూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్క‌ర్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జూలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి ఆంజనేయులు, పద్మ (30) దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆంజనేయులు వృత్తి రీత్యా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం వ్యవసాయ పనులు ముగించుకొని సాయంత్రం బర్రె పాలు పితికిన అనంతరం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో భార్య పద్మ తనని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆంజనేయులు తన సెల్ ఫోన్ ను నేలకేసి విసిరి కొట్టాడు. గొడవ తర్వాత ఆంజనేయులు తన పెద్ద కుమారుడిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి నిద్రపోయాడు. భర్త పై కోపంతో మనస్థాపానికి చెందిన పద్మ భర్త నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియ పెట్టింది. అనంతరం హాల్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొంత సమయం తర్వాత అనుమానం వచ్చి ఆంజనేయులు తలుపు కన్నంలో నుంచి చూడగా పద్మ వేలాడుతూ కనిపించింది. వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని కిందికి దింపి చూడగా అప్పటికే పద్మ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు ఉప్పునూతల మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.

Next Story