- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దృశ్యం సినిమా రిపీట్.. ప్రియుడితో పారిపోయేందుకు వివాహిత సినిమా రేంజ్ ప్లాన్
గుజరాత్ రాష్రంలో దృశ్యం సినిమా సీన్ రిపీట్ అయ్యింది. సినిమాలో ఓ డెడ్ బాడీ మాయం చేసేందుకు కేసులో దొరక్కుండా హీరో మరో డెడ్ బాడీని దాని స్థానంలో పెడతాడు.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్రంలో దృశ్యం సినిమా సీన్ రిపీట్ అయ్యింది. సినిమాలో ఓ డెడ్ బాడీ మాయం చేసేందుకు కేసులో దొరక్కుండా హీరో మరో డెడ్ బాడీని దాని స్థానంలో పెడతాడు. అయితే ఇక్కడ ప్రియుడితో పారిపోయేందుకు వివాహిత ఓ వ్యక్తిని హత్య చేసి అతడి శవానికి చీర, పట్టీలు తొడిగి తరవాత కాల్చివేసి తాను చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరికి దొరికిపోవడంతో కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. గుజారాత్‌లోని జఖోట్రాలో వివాహిత గీతా అహిర్ 22, భరత్ 21 మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ క్రమంలో భర్తను విడిచి ప్రియుడితో పారిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో రోడ్డుపై వెళుతున్న హర్జీభాయ్ సోలంకీ అనే వ్యక్తిని చంపి మృతదేహానికి తన చీర గాజులతో పాటూ పట్టీలు తొడిగి పూర్తి కాలిపోయేలా శవాన్ని తగలబెట్టారు. ఇక ఇంటికి వచ్చిన భర్త శవాన్ని చూసి అతి తన భార్య గీతదే అనుకున్నాడు. కానీ పోలీసులు వచ్చి చూడగా అది పురుషుడి శవం అని తేలింది. దీంతో విచారణ చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి. హంతకురాలు గీతతో పాటూ ఆమె ప్రియుడు భరత్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.






