- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరిగిన ఫ్లెక్సీ.. పరువుపోయిందని వ్యక్తి ఆత్మహత్య
ఫ్లెక్సీ చింపారనే నెపంతో కొందరు వ్యక్తులు చేసిన దాడికి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, దేవరకొండ టౌన్ : ఫ్లెక్సీ చింపారనే నెపంతో కొందరు వ్యక్తులు చేసిన దాడికి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేవరకొండ పట్టణంలోని అంజయ్య కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంజయ్య కాలనీకి చెందిన వర్ధo దశరథo (44) వృత్తిరీత్యా తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు. అదే కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులు, తమ ఫ్లెక్సీని దశరథం చింపాడనే ఆరోపణతో ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అందరి ముందు చేతులతో, కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ దాడితో తన పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన దశరథం శుక్రవారం తన ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కొత్త శిక్షాస్మృతి (BNS Act-2023) ప్రకారం క్రైమ్ నంబర్ 136/2026, U/s 329(4), 115(2), 118(1), 108 r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఒక సామాన్య కార్మికుడు ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో అంజయ్య కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.






