- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడు మనిషి కాదు.. మానవ మృగం.. ఖమ్మం జిల్లాలో సంచలన ఘటన
ఖమ్మం జిల్లాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాచకుడిపై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య, చిన్న పిల్లాడితో కలిసి అడుక్కుంటూ జీవనం సాగిస్తున్న రెహమాన్ అనే యాచకుడిపై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 29న తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి యాచకుడు రెహమాన్‌పై అకస్మాత్తుగా దాడి చేశాడు. గుండె, గొంతు భాగాలపై పదే పదే తంతూ క్రూరమైన దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, బాధితుడు మృతి చెందిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా దాడి కొనసాగించిన దుర్మార్గత్వం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి నిర్లక్ష్యంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై రెహమాన్ భార్య టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేయగా, అందులోని దృశ్యాలు చూసిన ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. వీడు మనిషి కాదు.. మానవ మృగం.. అని నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు సమాచారం. వీడియో ఇదే..






