చేవెళ్లలో వ్యక్తి దారుణ హత్య

by Ratna Kumari |

వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న చేవెళ్ల‌లో చోటు చేసుకుంది.

చేవెళ్లలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, చేవెళ్ల : వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న చేవెళ్ల‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ ఆలయ పుష్కరిణిలో గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కర్రతో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని నీళ్లలో పడవేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story