- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోటారును సరిచేసేందుకు వెళ్లి అనంత లోకాలకు..
మోటారు సరిచేస్తూ ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఓ వ్యవసాయ కూలీ మృతి చెందారు.

దిశ, పరిగి : మోటారు సరిచేస్తూ ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఓ వ్యవసాయ కూలీ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రాఘవాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధిత కుటుంబీకులు, స్థానిక సర్పంచ్ నల్క జగన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గడ్డమీది రాజు (35) ఆదివారం మొక్కజొన్న పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు.
నీరు సక్రమంగా రాకపోవడంతో మోటారు పుట్ బాల్ వద్ద ఏమైనా చెత్తా చెదారం తట్టి ఉండవచ్చిని బావిలోకి దిగాడు. బావిలో దిగిన రాజు ఎంతకూ పైకి రాకపోవడంతో ఇది గమనించిన తోటి రైతులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. బావిలో బురద ఉండటం వల్ల మునిగి ఉంటాడని బావించారు. గ్రామస్తులు బావి వద్దకు చేరుకొని బావిలో వెతికించగా బురదలో చిక్కుకున్న రాజును వెలికి తీశారు. అప్పటికే రాజు మృతి చెందాడు. మృతి చెందిన రాజుకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.






